24-07-2025 11:30:30 PM
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..
భూత్పూర్: జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Alla Venkateshwar Reddy) అన్నారు. భూత్పూర్ మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గృహంలో ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రుణమాఫీతో పాటు మహిళలకు 2500, వృద్ధులకు వికలాంగులకు పింఛన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని టీఆర్ఎస్ పార్టీ ఆదరించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐక్యతతో గ్రూపు రాజకీయాలు చేయకుండా గ్రామ గ్రామాలలో టీఆర్ఎస్ నాయకులను గెలిపించడం కోసం కృషి చేయాలన్నారు.
కార్యకర్తలు పార్టీ బలోపేత కోసం కృషి చేసి స్థానిక సంస్థలు విజయడంకా మోగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు మాటలతో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కార్యకర్తలు సమిష్టిగా ఉండి సర్పంచులు, ఎంపిటిసిలు, మున్సిపల్, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు, నాయకులకు అండగా నేనుంటా అందరం గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వ రాజ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నరేష్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, మురళీధర్ గౌడ్, సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, సత్తన్న, అశోక్ గౌడ్, సరోజ్ రెడ్డి, అజీజ్, మూసా బాలస్వామి, ఫసి, సాదిక్, రాము రాథోడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.