calender_icon.png 20 December, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు

20-12-2025 12:12:38 AM

జగిత్యాల క్రైం, డీసెంబర్19(విజయక్రాంతి): వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లం రాజేశ్వరి అనే మహిళ కు స్టంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం జగదీష్ను 2016 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, బొల్లం జగదీష్ గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి బానిసై ఎటువంటి పని చేయకుండా తిరుగుతూ, కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడంతో పాటు భార్యపై అనవసర అనుమానాలు పెంచుకుంటూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశాడని విచారణలో తేలింది. ఈ విషయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు గతంలో పలుమార్లు జగదీష్కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ నేపథ్యంలో తేది: మార్చి3,2023తెల్లవారు జామున సుమారు 3:15 గంటల సమయంలో, బొల్లం జగదీష్ తన భార్య రాజేశ్వరిపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేయడం జరిగింది.మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్ మరియు రమణమూర్తి లు కేసును దర్యాప్తు చేసి నిందితుడు జగదీష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మరియు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా, సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి రత్న పద్మావతి నిందితుడు బాల్లం జగద్పీ నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు 4,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.