calender_icon.png 19 May, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య

19-05-2025 01:45:03 PM

భార్య గొంతు నులిమి చంపిన భర్త

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామంలో భార్య గొంతు నులిమి భర్త హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. పందిళ్ళ గ్రామానికి చెందిన  సూర రాజు అనే వ్యక్తి తన భార్య సూర అంజలి(27)ని సోమవారం గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు కోరారు.