calender_icon.png 27 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

27-08-2025 12:03:45 AM

 ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే మందుల సామేలు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు అండగా ఉంటుందని,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని గుర్తు చేశారు.