calender_icon.png 27 August, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుభీర్ గణపతులకు రెండు దశాబ్దాలు

27-08-2025 12:05:56 AM

-కుభీర్ వినాయకులకు రాష్ట్ర గుర్తింపు గుర్తింపు 

-రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు

-ఆలోచింప చేసే వినాయక విగ్రహాల తయారీ 

-మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి అర్డర్లు 

--ఉమ్మడి ఆదిలాబాద్, నాందేడ్, నిజామాబాద్, యావత్మాల్ జిల్లాలకు ఇక్కడి విగ్రహాలే.. 

కుభీర్, ఆగస్టు 26: నిర్మల్ జిల్లాలోని మం డల కేంద్రం కుభీర్ వినాయక ప్రతిమల తయారీకి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కుభీర్‌కు చెందిన పర్వత్వార్ సాయిశ్యామ్ తన 13వ ఏట నుండి  సుమారు 20 ఏళ్ల కిందట మట్టితో చిన్న చిన్న ప్రతిమలను తయారుచేసి విక్రయించేవారు. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారి స్‌తో ప్రారంభించారు.

కుభీర్‌లోని శివ సాయి ఆలయ సమీపంలో ఖాళీ స్థలాలను కొనుగో లు చేసి రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే విశ్వబ్రహ్మ కళాధామం ఏర్పాటు చేశా రు. ఈ విగ్రహాలే కాదండోయ్ కర్రతో చేసిన అనేక రకాల విగ్రహాలు జాతీయ నాయకుల ప్రతిమలతో పాటు బండ రాళ్లకు  చెక్కిన శిల్పకళ ఈయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపె ట్టింది. మహారాష్ట్రతో పాటు ఈ ప్రాంతంలో వివిధ ఆలయాలకు బండరాళ్లపై చెక్కిన విగ్రహాలను అందించారు.

దీంతోపాటు ప్రతి ఏటా  వివిధ రకాల ఆకృతులు విభిన్నమైన అంశాలతో కూడిన వినాయక విగ్రహాలను తయారుచేసి కుబీర్ అంటేనే వినాయక విగ్రహాలకు పెట్టింది పేరుగా నిలిచింది. రాజస్థాన్ నుంచి రాష్ట్ర పారిస్ ఆంధ్ర నుంచి కొబ్బరి పీచును తెప్పించుకొని ఈ విగ్రహాలకు వినియోగిస్తుంటారు. పెద్ద పరిశ్రమగా తయారైన ఈ కేంద్రంలో ఏడాది పొడవునా పది నుంచి 20 మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ విజయవాడ మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణాల నుండి రంగురంగుల వస్త్రాలు, పట్టు పంచలు కండువాలు, మెరుపును తెప్పించి వివరాలకు అలంకరిస్తారు. 

వేల సంఖ్యలో..

నిర్మల్ జిల్లాలో విగ్రహాల తయారీ కేంద్రాలు స్వల్పంగా ఉన్నప్పటికీ అం దులో నాలుగైదు రకాల విగ్రహాలు మాత్రమే అచ్చులతో తయారు చేస్తారు. కానీ కళాకారుడు సాయి శ్యాం తయారు చేస్తున్న విగ్రహాలు వివిధ రకాలుగా అందర్నీ ఆకర్షించే విధంగా ఉంటున్నాయి. దీంతో ఆరు నెలల క్రితం నుండే ఆర్డర్లు ఇస్తారు. మూడు అడుగుల నుండి సుమారు 15 అడుగుల వరకు విగ్రహాలు వందల సంఖ్యలో తయారు చేస్తారు.  ఈయన చేసిన విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. 

జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు 

విగ్రహాల తయారీలో పెరుగాంచిన  సాయిశ్యామ్‌ను రాష్ట్రస్థాయిలో ట్రూ ఇండియన్ అవార్డు, గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ తెలంగాణ అవార్డు, ఉత్తమ శిల్ప కళాకారుడిగా జిల్లా, మండల స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నా రు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ కమిషనర్ శైలజా రామయ్యర్ కుబీర్ లోని కళాధామాన్ని సందర్శించి కళాకారుడు సాయి శ్యామ్‌ను అభినందించారు.

తమ సంస్థ పరంగా కర్ర, బండ రాళ్లతో చేసిన ప్రతిమలను విక్రయించుకునేందుకు ఎగ్జిబిషన్లో స్టాల్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. ఆయన తయారు చేసే విగ్రహాలకు గిరాకీ ఎక్కువ, ఒక్క విగ్రహం కూడా మిగిలిపోవడం ఉండదు. గత 20 ఏళ్లుగా తన కళకు పదును పెట్టి  విభిన్న ఆకృతులలో వినాయక విగ్రహలు తయారుచేస్తూ గుర్తింపు పొందిన సాయి శ్యామ్‌ను అందరూ అభినందిస్తున్నారు.