19-05-2025 12:13:40 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శ్రీకృష్ణ పెరల్స్ పేరిట గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలు కొంతకాలంగా ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. అయితే మే 18వ తేదీ అర్థరాత్రి షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఈ ఘనటపై రాష్ట్ర ప్రభుత్వం వేంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. ఘటనాస్థలిన్ని పరిశీలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం భవన యజమాని నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పేర్కొంది.
ఫస్ట్ ఫ్లోర్ లోని ఏసీ కంప్రెషర్ నిరంతరంగా నడుస్తుండడంతో షార్ట్ సర్క్యూట్ కు గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని గ్యాస్ లిండర్ లీక్ కావడంతో మంటలు చెల్లరేగి వ్యాపించాయి. దీంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని భవనంలో ఉన్నవారిని బయలకు తరలించారు. భవన ప్రవేశద్వారం, అంతస్తులకు వెళ్లే మార్గాలు ఇరుకుగా ఉండడంతో లోపాల ఉన్నవారు రాలేకపోవడంతోనే మృతుల సంఖ్య పెరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
విద్యుత్ సరఫరాలో తరచుగా సమస్యలు వస్తున్నాయని ఎన్నిసార్లు యజమానికి సమాచారం ఇచ్చినప్పటికి పట్టించుకోలేదని బాధిత కుటుంబీకులు వాపోయారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చార్మినార్ పోలీసులు పేర్కొన్నారు. ఇక మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.