calender_icon.png 20 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగరంలో ఘనంగా ‘హైడ్ ఆర్ట్’ ప్రారంభం

20-12-2025 12:00:00 AM

సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, మల్లారెడ్డి హెల్త్ సిటీ, విద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి హాజరు

హైదరాబాద్, డిసెంబర్(విజయక్రాంతి): నగరంలోని నానక్‌రామ్‌గూడ నవనామి ఈయాన్‌లో ‘హైడ్.ఆర్ట్ 2025’ మహా సాంస్కృతిక వేడుకలు శుక్రవారం నుంచి ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నగరం కాస్మోపాలిటన్ కేంద్రంగా రూపాంతరం చెందుతున్న ఈ సమయంలో ఇటువంటి వేడుకలు అవసరమన్నారు.

ఇక్కడ ప్రదర్శిస్తున్న కళాఖండాల నాణ్యత ఎంతో ప్రశంసనీయం అన్నారు. గౌరవ అతిథి మల్లారెడ్డి హెల్త్ సిటీ అండఖ విద్యాపీఠ్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడు తూ ఈ ప్రదర్శనలో గడిపిన సమయం ఒక మరపురాని అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ ప్రత్యేక కళా ప్రదర్శనను హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అన్నపూర్ణకు అభినందనలు తెలిపారు. ఇది ప్రతి ఏడాది జరగాల్సిన గొప్ప కార్యక్రమం అన్నారు.

నవనామి గ్రూప్ రూపొందించిన తాజా ప్రీమియం ప్రాజెక్ట్ మెగలియో కూడా విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. హైడ్.ఆర్ట్ క్యూరేటర్, షో డైరెక్టర్ అన్నపూర్ణ మడిపడిగ మాట్లాడుతూ హైదరాబాద్ చివరకు తన సిగ్నేచర్ ఆర్ట్ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇచ్చిందన్నారు. ఈ హైడ్.ఆర్ట్ 2025 ద్వారా రెండు వందల మందికి పైగా కళాకారులు ఒకే వేదికపై కలుస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలోని మరో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ పామర్తి రూపొందించిన 150 మహా త్మా గాంధీ చిత్రాలతో కూడిన పుస్తకావిష్కరణ జరగనుందన్నారు.

హైడ్.ఆర్ట్ వ్యవస్థాప కుడు హసన్ మాట్లాడుతూ స్థానిక కళాకారులను బలోపేతం చేయడం, వారికి నగరం వెలుపల గుర్తింపు కల్పించడం, దేశంలోని అత్యుత్తమ కళాఖండాలను ఒకే వేదిక పైకి తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఇది ఏర్పా టు చేశామన్నారు. నవనామి ప్రాజెకట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ నవీన్ గద్దె మాట్లాడుతూ నవనామిలో కళ, సంస్కృతికి జీవం పోసే కళాకారులను ఆదరించడం ఎంతో ముఖ్యమని నమ్ముతామన్నారు.

అందుకే హైడ్.ఆర్ట్ 2025తో భాగస్వామ్యం కావడం మాకు ఒక సహజమైన నిర్ణయంగా నిలిచిందన్నారు.  సీఎంఓ, బిజినెస్ హెడ్ ఆర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ కళ, డిజైన్ కలిసినప్పుడు సాంస్కృతిక వాతావరణం మరింత సుసంపన్నమవుతుందని చెప్పారు. ఇదే ఆలోచన మమ్మల్ని హైడ్.ఆర్ట్ 2025తో కలిసేటట్టు చేసిందన్నారు. కార్యక్రమంలో నవనామి ప్రాజెకట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కృష్ణ కాంత్ కోటగిరి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 200 పైగా కళాకారుల కళాకృతులు కళాభిమానులను ఆకట్టుకున్నాయి.