25-01-2026 12:17:43 AM
హైదరాబాద్, జనవరి 24: హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ ఎడ్ల సృజన అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు ఎంపికైంది. ఇప్పటివరకు సపోర్ట్ బౌలర్‌గా ఉన్న సృజనకు ఇప్పుడు ఏకంగా ప్రధా న జట్టులో చోటు దక్కింది. మరో హైదరాబాదీ క్రీడాకారిణి ఎం మమత గాయపడటం తో ఆమె స్థానంలో సృజనకు ఈ అవకాశం లభించింది. ప్రస్తుతం వడోదరలో జరుగుతున్నడబ్ల్యూపీఎల్ మిగిలిన మ్యాచ్‌లలో సృజ న ఆడనుంది.
ఈ సందర్భంగా సృజన తన ఆనందాన్ని పంచుకుంది. సపోర్ట్ బౌలర్‌గా జట్టుతో ఉండటమే గొప్ప విషయంగా భా వించిన తనకు ప్రధాన జట్టులో చోటు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నది. తనపై ఫ్రాంచైజీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపింది. 20 ఏళ్ల సృజన మీడియం పేస్ బౌలర్‌గా రాణిస్తోంది. తక్కువ పరుగులిస్తూ వికెట్లు తీయడం ద్వారా అందరినీ ఆకర్షించింది. సికింద్రాబాద్ సెయింట్ జాన్స్ కోచింగ్‌ఫౌండేషన్‌లో ఈమె శిక్షణ పొందింది. తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చానని సృజన తెలిపింది.