25-01-2026 12:16:13 AM
అండర్ 19 వరల్డ్ కప్
బులావాయో, జనవరి 24: ఇటు సొంతగడ్డపై టీమిండియా సీనియర్ జట్టు న్యూజి లాండ్‌ను వరుస మ్యాచ్‌లలో చిత్తు చేస్తుం టే.. అటు భారత కుర్రాళ్ల జట్టు కూడా కివీస్‌ను నిలువరించింది. అండర్ 19 ప్రపంచ కప్ జైత్రయాత్రను కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో కివీస్ పెద్ద గా పోటీ ఇవ్వలేకపోయింది. 36.2 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్ కేవ లం 13.3ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది.