calender_icon.png 31 August, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ అభివృద్ధే అజెండా

31-08-2025 12:45:13 AM

- పలు అంశాలపై స్టాండింగ్ కమిటీ ఆమోదం

- మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం

- హాజరైన కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): నగర మేయర్ గద్వాల్ విజ యలక్ష్మి అధ్యక్షతన శనివారం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 9 అజెండా అంశాలతో పాటు 4 టేబుల్ అంశాలకు ఆమోదం లభించినట్లు మేయర్ వెల్లడించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ, వీధి దీపాల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై కమి టీ నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశానికి జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆమోదం పొంది న ప్రధాన అజెండా అంశాల్లో.. ఎల్‌బి నగర్ జోన్‌లోని హయత్‌నగర్ సర్కిల్‌లో ఉన్న కుమ్మరి కుంట చెరువు నుంచి రాఘవేంద్ర కాలనీ బస్ డిపో వరకు రూ.6 కోట్ల వ్యయం తో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్లు పిలవడానికి ఆమోదం లభించింది. హైదరాబా ద్‌లోని రహదారుల నిర్వహణ కోసం చేపట్టే కంప్లీట్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం రెండ వ దశకు ఆమోదం లభించింది.

దీని కింద ఐదు సంవత్సరాల పాటు (2025 1,142.54 కిలోమీటర్ల రోడ్లను రూ.2,828 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. కట్‌పల్లి సర్కిల్‌లోని బాలానగర్ ఫ్లుఓవర్ కింద స్పోర్ట్స్ ఏరియా నిర్వహణ కోసం ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడా నికి అనుమతి ఇవ్వబడింది. దీనికి సంబంధించిన రెంటల్ చార్జీలను ఏడాదికి రూ. 1,35,550గా నిర్ణయించారు. చార్మినార్ వద్ద మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణానికి సంబంధించి ‘డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్’ పద్ధతిలో 15 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు ఆమోదం లభించింది.