calender_icon.png 1 September, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క కాటుతో మూడేళ్ల బాలుడు మృతి

31-08-2025 12:48:56 PM

హైదరాబాద్: జగిత్యాల జిల్లా(Jagtial District) బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో ఇంద్రాల రక్షిత్ అనే మూడేళ్ల బాలుడు కుక్క కాటుతో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కొన్ని వారాల క్రితం రక్షిత్ పై కుక్కల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు డ్రైనేజీలో పడి గాయపడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. కుటుంబ సభ్యులు బాలుడని ఆసుపత్రిలో చేర్పించి గాయాలకు చికిత్స అందించారు. చికిత్స అందించినప్పటికీ బాలుడికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వలేదని సమాచారం ఉంది. నాలుగు రోజుల క్రితం భారీ వర్షాల నేపథ్యంలో బాలుడి నోటి నుండి నురగలు రావడం ప్రారంభించాయి. అతని కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.