31-08-2025 12:14:40 PM
బెల్లంపల్లి అర్బన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తిపైన బీహార్ లో జరిగిన ఒక సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) దిష్టిబొమ్మను ఆదివారం బెల్లంపల్లిలో దహనం చేశారు. పోచమ్మ గడ్డ చౌరస్తాలో బెల్లంపల్లి మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గాదర్ల నగేష్, కార్యదర్శి సాయి, ఈశ్వర్, నాయకులు చొప్పరి మహేష్, రమేష్, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.