31-08-2025 12:44:10 AM
టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2021 వేత న సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎం యూ) ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి డిమాం డ్ చేశారు. శనివారం లక్డీకాపూల్‌లో జరిగిన టీఎంయూ జోన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటు యూనియన్ల పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించా లని కోరారు. ప్రభుత్వం స్పం దించకుంటే కార్మికుల సమస్యలపై దశలవారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోనల్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ నేతలు బోయపల్లి యాదయ్య, టి రవికుమార్, ఎంహెచ్ అలీ, డీఎస్ లక్ష్మయ్య పాల్గొన్నారు.