calender_icon.png 1 September, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో ఏముందంటే..

31-08-2025 11:38:11 AM

హైదరాబాద్: మూడు ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణంలో పూర్తి లోపాలు, తప్పిదాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. అలాగే అంచనాల తయారీ పరిపాలన అనుమతుల్లో కూడా లోపల ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ(CWC) అనుమతుల్లోనూ లోపాలున్నట్లు, నిపుణుల కమిటీ ప్రకారం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించరాదని నివేదిక పేర్కొంది. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సాహేతుకం కాదని నివేదిక తెలిపింది. పూర్తిగా ఆనాటి సీఎం కేసీఆర్(KCR) నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించారని నివేదిక పేర్కొంది. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మించారని నివేదిక తెలిపింది. ఆనకట్టల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టు విధానం సరికాదని పీసీ ఘోష్ నివేదిక పేర్కొన్నది. డీపీఆర్ పూర్తిగా పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించారని, కాంట్రాక్టర్ల లబ్ధికే అంచనాల పెంపు నిబంధనలు సడలించారని నివేదిక స్పష్టం చేసింది.

ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో అంచనాలు సవరించారని, అంచనాలను సవరించి ఖజానాకు నష్టం చేకూర్చారని నివేదిక తెలిపింది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్వహణ సరిగా లేదని.. ఆనకట్టల డిజైన్లు డ్రాయింగ్స్ లో పూర్తిగా లోపాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదని లోపాలు ఉన్నాయని, మేడిగడ్డ కు సబ్ స్టాన్షియల్ కంప్లీట్ సర్టిఫికెట్ ఇవ్వడం అక్రమమని నివేదిక పేర్కొన్నది. బ్యాంకు గ్యారెంటీల విడుదల కూడా తప్పని, ఎలాంటి పెనాల్టీ విధించకుండా కాంట్రాక్ట్ పొడిగించారని నివేదిక తెలిపింది. కాంట్రాక్టర్ల లబ్ధికే ఆనాటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, ఆనాటి ఈఎన్సీ మురళీధర్ అన్ని అంశాలు తొక్కి పెట్టారని నివేదిక తెలిపింది.