31-08-2025 12:46:48 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): మియాపూర్‌లో ఉన్న బస్ బాడీ వర్క్స్ (బీబీడబ్ల్యూ), ఉప్పల్ ఉన్న జోనల్ వర్క్‌షాప్‌ను కరీంనగర్‌కు తరలించొద్దని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, అందుకే ఈ అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని శనివారం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వినతిప త్రం సమర్పించారు.
బీఆర్‌ఎస్ సర్కారు తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఆర్టీసీ ఆస్తులను విక్రయించేందుకే ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని తాము భావిస్తున్నామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ రెండు యూనిట్లను తరలించడమంటే సంస్థను మూసేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తాము భావిస్తున్నామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న పేర్కొన్నారు. మియాపూర్‌లో 18 ఎకరాలు, ఉప్ప ల్‌లో 16 ఎకరాలు ఎంతో ఖరీదైనవని, వీటి ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు.
కార్మికుల్లో తీవ్ర ఆందోళన
మియాపూర్ బస్ బాడీ వర్క్స్, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్‌ను కరీంనగర్, నాగర్ కర్నూలుకు తరలించాలనే ఆర్టీసీ యాజమా న్యం తొందరపాటు చర్యకు పాల్పడుతోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి కమాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్ ఒక ప్రకటనలో అన్నారు. కార్మికుల్లో నెలకొన్న అశాంతి ఆందోళనగా మారకముందే సర్కారు పునరాలోచన చేయాలని కోరారు.