08-05-2025 06:29:39 PM
సికింద్రాబాద్,(విజయక్రాంతి): ముంపు బాధితుల సమస్యలను హైడ్రా(Hydraa) వెంటనే పరిష్కరిస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ లోని బుద్ధభవనంలో ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
అనంతరం హైడ్రా కోసం సమకూర్చిన యంత్రాలు, వాహనాలను సైతం ప్రారంభించారు. ఈ సంర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ... ప్రజలు ఏ విభాగాన్ని సంప్రదించాలో తెలియని సమస్యలను హైడ్రా పరిష్కరిస్తోందన్నారు. ఫలానా సమస్య మా పరిధిలోకి రాదని మేం గిరిగీసుకోలేదని, ఏ శాఖకు చెందిన విధి అయినా, ముందుగా ఆ పని మేము పూర్తి చేస్తున్నామని తెలిపారు. హైడ్రా వల్ల చెరువులు, నాలాల కబ్జాలు తగ్గిపోతున్నాయని, అలాగే హైడ్రా చేస్తున్న పలు కార్యక్రమాలను రంగనాథ్ తెలియజేశారు.