calender_icon.png 8 May, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజాపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు.. 8 మంది నక్సల్స్ మృతి

08-05-2025 06:07:21 PM

బీజాపూర్,(విజయక్రాంతి): బీజాపూర్ సరిహద్దులో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, ఎస్జేడ్ సీఎం బండి ప్రకాష్ సహా మొత్తం 8 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులు జరుగుతున్న సమయంలోనే నక్సల్స్ చాకచాక్యంగా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారు.

గతంలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నపై రూ.కోటి రివార్డ్ ప్రకటించింది. మందుపాతర పేలుడు ఘటనలో ఐదుగురు గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరోకరి తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారి మృతదేహాలను ఏటూరు నాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించి, ఐఈడీ పేలుడు ఘటనలో గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో తెలంగాణ రాష్టంలోని ఘట్కేసర్ వాసి జవాన్ అశోక్ కూడా ఉన్నట్లు సమాచారం.