calender_icon.png 9 May, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్

08-05-2025 11:22:19 PM

ఉద్రిక్త పరిస్థితుల రీత్యా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వం అలర్ట్ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఎవరూ కూడా జిల్లా దాటి వెళ్లవద్దంటూ, సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్య సంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించింది. అలాగే అక్కడి అధికారులకు సెలవులు రద్దు చేస్తూ.. అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రజలకు ప్రభుత్వాలు సూచించింది. ఇళ్లలోని లైట్లు ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, పరిస్థితులను ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులు, ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు.