01-11-2025 12:36:55 PM
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో(Nirmal district) సోయా కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. తానూర్, కుబీర్, భైంసా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అర్ధరాత్రి నుంచే టోకెన్ల కోసం( soya tokens) రైతులు బారులు తీరారు. తానూరులో రైతులు క్యూలైన్లలో చెప్పులు, పాసు పుస్తకాలు పెట్టారు. బైంసా పీఏసీఎస్ లో టోకెన్ల కోసం రైతుల మధ్య తొక్కిసలాట జరిగింది. రైతులు శుక్రవారం రాత్రి నుంచి తానూర్ సెంటర్ కు చేరుకుని క్యూలైన్ లోనే నిద్రపోయారు. కుబీర్ పీఏసీఎల్ లో టోకెన్ల పంపిణీలో తోపులాట జరిగింది. కొన్ని కేంద్రాల్లో కూలైన్లలో రైతులు చెప్పులు, బండరాళ్లు పెట్టారు. అధికారులు తక్షణమే స్పందించి సోయా టోకెన్ కౌంటర్లను పెంచాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగు సంక్షోభం కూరుకుపోయిందని రైతులు మండిపడుతున్నారు. రైతులను ముప్పుతిప్పలు పెడుతూ రేవంత్ సర్కార్ తమను ఆగం చేసిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే యూరియా కొరత, మరోవైపు ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఉందని, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆగమయ్యామని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.


