01-11-2025 01:08:38 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట(Kashi Bugga stampede incident) జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడంపై మంత్రి నారా లోకేష్(Minister nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొందన్న లోకేష్ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడినట్లు లోకేష్ పేర్కొన్నారు. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.