calender_icon.png 24 May, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్, శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

24-05-2025 12:00:00 AM

రూ. 200 కోట్ల స్థలానికి రక్ష

శేరిలింగంపల్లి/రాజేంద్రనగర్, మే 23: జూబ్లీహిల్స్, శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలను శుక్రవారం హైడ్రా అధికారులు కోర్టు అనుమతితో కూల్చివేశారు. జూబ్లీహి ల్స్ రోడ్ నంబర్ 41లోని పెద్దమ్మ గుడి సమీపంలో నాలాతో పాటు పార్కుకు కేటాయిం చిన రహదారిని కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. 30 అడుగుల రహదారి లో ఆక్రమణలు తొలగించి రెండెకరాల పా ర్కుకు దారి చూపింది.

దాదాపు రూ.200 కోట్ల ఆస్తిని కాపాడి, ప్రజావినియోగంలోకి హైడ్రా తెచ్చింది. క్రమాలపై జూబ్లీహిల్స్ సొసైటీ ప్రతినిధులు, స్థానికులు ఇచ్చిన ఫి ర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో ఇది వరకే పరిశీలించారు. వాటి తొలగింపునకు నోటీసులు కూడా గ తంలోనే ఇచ్చారు. కోర్టునుంచి అనుమతు లు లభించడంతో శుక్రవారం కూల్చివేశారు.

అద్దెకు దిగి కబ్జాలు..

జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 41లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి చేరువలో అవసరాల శ్రీనివాస్, రుక్మాందగరావుకు వెయ్యి గజాల స్థలం ఉన్నది. ఇందులో 200 గజాల వరకు ఇల్లు కట్టారు. క్రోతుపల్లి శ్రీనివాస్‌కు దీనిని అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటి పక్కనే 30 అడుగుల మేర రోడ్డు ఉన్నది. ఆ దారిలోనే బాక్సు ఆకారంలో నాలా ఉంది. ఈ రోడ్డు మార్గం లో వెళ్తే 2 ఎకరాల పార్కుకు చేరుకోగలం.

కానీ ఆ దారిని, నాలాను క్రోతుపల్లి శ్రీనివా స్ ఆక్రమించి, హాస్టల్ నిర్మించాడు. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో  కారు మరమ్మతుల షెడ్డును ఏర్పా టు చేసి అద్దెకు ఇచ్చా డు. మొత్తం 907 గజాల మేర ఆక్రమణలకు పాల్పడ్డాడు. వాటిని అద్దెకు ఇచ్చి నెలకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఇవన్నీ యజమానికి సంబంధం లేకుండా జరిగిపోయాయి.

స్థానికుల ఫిర్యాదుతో హై డ్రా రంగంలోకి దిగి, ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై క్రోతుపల్లి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతడిని తప్పుపడుతు ఆక్రమణల తొలగింపునకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు హాస్టల్ భవనాన్ని, మెకానిక్ షెడ్డును హైడ్రా తొలగించి, రెండెకరాల పార్కుకు దారి చేసింది.

ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ 

శంషాబాద్ మండల పరిధిలోని తొండపల్లి గ్రామంలో సర్వేనంబర్ 108లో కొన్ని సంవత్సరాల క్రితం రియల్టర్లు లే అవుట్ ఏర్పాటు చేశారు. ఆ భూమికి ఆనుకొని ఉన్న 109 సర్వే నంబరులో రూ.కోట్లు విలువచేసే  2.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. రియల్టర్లు ఆ ప్రభుత్వ భూమిని పార్కు స్థలంగా చూపిస్తూ కబ్జా చేసేందుకు పన్నాగం పన్నారు.

కాలనీవాసుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఫెన్సింగ్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైడ్రా సిబ్బంది ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నెంబరు 108లో లేఔట్ చేసిన వ్యక్తులు గతంలో ఆలయానికి సుమారు ఎకరం స్థలం వదిలారు. ఆ స్థలానికి కూడా ప్రీ కాస్ట్ ఏర్పాటు చేశారు.