04-10-2025 08:41:07 AM
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్(Kondapur) సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో శనివారం ఉదయం నుంచి కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో కూల్చివేతలు మొదలయ్యాయి. రెండున్నర దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతుందని హైడ్రా అధికారులు ప్రకటించారు. భారీ పోలీస్ బందోబస్తుతో హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ప్రారంభించింది. కూల్చివేతల వద్దకు పోలీసులు మీడియాను కూడా అనుమతించేదు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.