calender_icon.png 4 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశీ వస్తువులనే వినియోగించాలి

04-10-2025 02:19:44 AM

  1. దేశీయ ఉత్పత్తులను పెంచాలి
  2. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
  3. నాగ్‌పూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో శతాబ్ది ఉత్సవం

ముంబై, అక్టోబర్ 3: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఇష్టారీతిన సుంకాలు విధిస్తున్నారు. ఆ సుంకాల ప్రభావం భారత్‌పై ఉండకూడదంటే ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను వాడాలి. దేశీయ ఉత్పత్తిలను పెంచి స్వావలంబన సాధించాలి. విదేశీ దిగుమతులపై మనం ఆధారపడకూడదు. స్వయం సమృద్ధి వైపు పయనించాలి. దేశం ‘ఆత్మనిర్భర్’ భారత్‌గా ఎదగాలి’ అని రాష్ట్రీ య స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మో హన్ భగవత్ ఆకాంక్షించారు. మహారాష్ట్రలో ని నాగ్‌పూర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానా కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంస్థ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు.

ముం దుగా సంస్థ పెద్దలు ‘శస్త్ర పూజ’ నిర్వహించారు. సంప్రదాయ ఆయుధాలు, డ్రోన్‌లతో సహా ఆధునిక ఆయుధాల నమూనాలను సందర్శించారు. ఈసందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. మిత్ర దేశాలన్నింటితో భారత్ దౌత్య సంబంధాలను కొనసా గించేందుకు కృషి చేయాలన్నారు. అది కూడా భారత ప్రభుత్వ అభిమతం ప్రకారం జరగాలని, దీనిలో ఎవరి బలవంతమూ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు భారతీయులను మతమేంటని ప్రశ్నించి కాల్చి చంపారని, దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి భారత పభుత్వం ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందని కొనియా డారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమని అభిప్రాయపడ్డారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదన్నారు. కొన్నిరకాల వైవిధ్యాలు విభేదాలకు దారితీయ వచ్చని, వాటిని చట్టపరిధిలోనే వ్యక్తం చేయాల్సి ఉంటుందని, సమాజాన్ని రెచ్చగొట్టడం ఆమోదయోగ్యం కాదని హితవు పలి కారు.

అలాంటి అరాచకాలను ఆర్‌ఎస్‌ఎస్ అడ్డుకుంటుందన్నారు.  ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభ మేళా గురించి ప్ర స్తావిస్తూ.. కుంభమేళా భారతదేశాన్ని ఒక్కటి చేసిందని, దేశ నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్‌రాజ్ చేరుకుని పుణ్యస్నానమాచరించారని తెలిపారు. కుంభమేళా భారతీయుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు.

అశాంతి వల్లే నేపాల్‌లో తిరుగుబాటు

పొరుగు దేశం నేపాల్‌లో ప్రజల్లో అశాం తే ప్రభుత్వంపై తిరుగుబాటుకు కారణమైందని, జెన్‌జెడ్ ఉదయం అలా పుట్టుకొచ్చిం దేనని మోహన్‌భగవత్ అభిప్రాయపడ్డారు.  అశాంతి ఏ దేశానికీ శుభసూచకం కాదని, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌ల్లో వచ్చిన తిరుగుబాటు భారత్‌లో రాకూడదన్నారు. భారత్‌లోనూ అల్లర్లు సృష్టించాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయని, ఆ శక్తులు దేశం లోపల, వెలు పల కూడా చురుగ్గాగా ఉన్నాయని తెలిపారు.

హింసాత్మక తిరుగుబాటు అరాచకానికి మాత్ర మే దారితీస్తాయని, విదేశీ శక్తులకు జోక్యం చేసుకుంటే అరాచకమే రాజ్యమేలుతుందని అభిప్రాయపడ్డారు. అలాంటి హింసాత్మక ఘటనలు నిర్దిష్ట ఫలితాలను తీసుకురావని, పైగా రాజకీయ అస్థిరతను తీసుకొస్తాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎన్నో సోషలిస్టు ఉద్యమాలు జరిగాయని, అయితే.. ఆ సోషలిస్టు దేశాలన్నీ ఇప్పుడు పెట్టుబడిదారీ దేశాలుగా మారాయని గుర్తుచేశారు.