03-08-2025 12:49:07 AM
బస్తీతో దోస్తీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): హైడ్రా అంటే కూలగొట్టడం కాదు.. పర్యావరణ హితమైన, అందరికీ నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించడమని, తమ హెచ్చరిక చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికేగానీ, పేదలకు కాదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంలో భాగంగా శనివారం టోలీచౌకిలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో కమిషనర్ ప్రజలతో మమేకమయ్యారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 ఎకరాల భూమిని కబ్జా చేసి, అందులో పనివాళ్ల కో సం ఓ చిన్న షెడ్డు వేసి.. దాన్ని తొలగించినప్పుడు, ఆ పేదలను ముందుపెట్టి గేమ్ ఆడు తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దుష్ర్పచారాన్ని నమ్మొదని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదల ఇళ్ల ను తొలగించాల్సి వస్తే, వారికి ప్రత్యామ్నా య నివాసం చూపించాకే ముం దుకెళ్తామని, ఇదే ప్రభుత్వ విధానమని హామీ ఇచ్చారు.
టోలీచౌకి, షేక్‌పేట ప్రాంతాల్లో ఏళ్లుగా పేరుకుపోయిన నాలాల పూడికను పది రోజుల్లో తొలగించి, వరద ముప్పు నుంచి ఉపశమనం కలిగించామని తెలిపారు. చారిత్రక బుల్కాపూర్ నాలా పొడవునా సీసీటీవీలు పెట్టి, చెత్త వేసేవారిని నివారిస్తామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వెంకటేష్, ఫరాజ్‌లు మాట్లాడుతూ, హైడ్రా పేదల పక్షమని అంబర్‌పేట బతుకమ్మకుంట అభివృద్ధితో రుజువైందని కొనియాడారు.