calender_icon.png 3 August, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నానికి అలమటిస్తున్న విద్యార్థులు

03-08-2025 12:50:19 AM

-అడిగితే టీసీ ఇస్తామని బెదిరింపులు

- భద్రాద్రి జిల్లా చీపురుగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన

అశ్వారావుపేట, ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని దమ్మపేట మండలం చీపురుగూ డెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమకు నెల రోజులుగా సక్రమంగా భోజనం పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన శనివారం వెలుగు చూసింది. పాఠశాలలో పడుతున్న ఇబ్బందులను కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాలలో పెట్టారు.

తమను హెచ్‌ఎం, వార్డెన్లు పట్టించుకోవటం లేదని, భోజనం సక్రమంగా పెట్టటంలేదని, మెనూ ప్రకారం ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోమలు కుట్టి తమకు జ్వరాలు వస్తున్నాయని, ప్యాన్లు చెడిపోయిన బాగు చేయించటం లేదని, ఎవరైన మాట్లాడితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. భోజనం బాగోక పోవటంతో అంతా చెత్త డబ్బాలో వేస్తున్నట్లు చూపెట్టారు. ఇప్పటికైనా పాఠశాలలో సమస్యలు పరిష్కరించి మెనూ ప్రకా రం భోజనం పెట్టాలని విద్యార్థులు కోరుతున్నాను. ఈ విషయం తెలుసుకున్న డీడీ సరస్వతి, గిరిజన సహాయసంక్షేమ శాఖా అధికారి చంద్రమోహన్ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.

పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే

చీపురుగూడెం పాఠశాలలో విద్యార్థులకు భోజనం సక్రమంపెట్టటం లేదని తెలుసుకు న్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై టీచర్లు, అధికారులతో చర్చిం చి బాద్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.