29-10-2025 12:00:00 AM
పటాన్చెరు : నిరుపేదలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పలోత్ రఘు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేయగా రెండు లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం మంజూరు అయింది. ఈ మేరకు రఘు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎల్‌ఓసి అందజేశారు.