24-08-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర భవిష్యత్తును, ముఖ్యంగా నీటి వనరుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాబోయే వందేళ్ల ప్ర ణాళికతో హైడ్రా పనిచేస్తోందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణే లక్ష్యంగా ముందు కెళ్తున్నామని ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా విధివిధానా లను, ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు.
హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితమైన సంస్థ కాదని, వందేళ్ల ప్రణాళిక అని పేర్కొన్నారు. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతుండటంతో, కొందరు సీఎస్‌ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు తో వాటిని ఆక్రమించుకోవాలని ప్రయత్ని స్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ మార్కింగ్‌ను సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో పక్కాగా చేస్తున్నామని, కబ్జాలకు ఆస్కారం లేకుండా చూస్తు న్నామని తెలిపారు.
నగరంలో కాలుష్యం, కబ్జాల కారణంగా 60 నుంచి 65 శాతం చెరువులు కనుమరుగయ్యాయని రంగనాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల మాదిరిగానే, నాలాల కబ్జాలను నిరోధించేందుకు వాటిని కూడా నోటిఫై చేస్తామన్నారు. హైడ్రాకు విపత్తు నిర్వహణ అత్యంత ముఖ్యమైన విధి అని పేర్కొన్నారు. వర్షాలు లేన ప్పుడు తమ సిబ్బంది నాలాలు, మ్యాన్‌హో ల్స్ శుభ్రం చేస్తారని, నాలాల్లో వేలాది ట్ర క్కుల పూడికను తొలగిస్తున్నామని చెప్పారు.