24-08-2025 12:00:00 AM
-రూ.101.77 కోట్ల సెస్ బకాయిలు చెల్లించండి
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): సిరిసిల్లలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశా రు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చే యాలన్నారు.
ఈ మేరకు శనివారం డిప్యూ టీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ లేఖ రాశారు. మారిన మార్కెట్ పరిస్థితులతో బతకలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చేందుకు తమ హయాంలో బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్‌తో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరకడంతో పా టు స్థిరమైన ఆదాయం లభించిందని తెలిపారు.
ప్రస్తుతం పవర్ లూమ్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు.. కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయన్నారు. కుటీర పరిశ్రమల క్యాటగిరీ కింద 50 శాతం విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, అవగాహనా లోపంతో ఎస్‌ఎస్‌ఐ యూనిట్లుగా మారాయన్నారు. ఈ క్ర మంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు, అలాగే 191 ఇతర యూ నిట్లకు మొత్తం రూ.35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్ లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో సెస్..
పవర్ లూమ్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందనిన్నారు. టీజీఎన్‌పీడీసీఎల్‌కు చెల్లించాల్సిన విద్యుత్ ఖర్చులను కూడా చెల్లించలేకపోతుందని వివరించారు. వెంటనే బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేయాలని కోరారు.