calender_icon.png 24 August, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ విద్య దశకోటి కుంకుమార్చన

24-08-2025 12:00:37 AM

- అభిషేక బ్రహ్మచారి మార్గదర్శకత్వంలో మహాయజ్ఞం 

- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బండారు దత్తాత్రేయ, హిత్‌కుమార్‌సింగ్ హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కల్యాణ మండపంలో దేశ ప్రగతి, విశ్వశాంతి, పేదల సంక్షేమం కోసం శనివారం ప్రముఖ సన్యాసి స్వామి అభిషేక బ్రహ్మచారి మార్గదర్శకత్వంలో శ్రీ విద్య దశకోటి కుంకుమార్చన మహాయజ్ఞం నిర్వహిం చారు. ఈ మహాయజ్ఞంలో 2,000 మందికి పైగా సుమంగళి మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

మూడు రోజులలో పదికోట్లసార్లు శ్రీ లలితా సహస్రనామం జపించి, సింధూరంతో అర్చన నిర్వహించనున్నారు. ఈ య జ్ఞాన్ని అభిషేక బ్రహ్మచారితో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, యువచేతన జాతీయ సమన్వయకర్త రోహిత్‌కుమార్‌సింగ్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా అభిషేక బ్రహ్మచారి మాట్లాడుతూ.. “సనాతన ధర్మంలో అందరికీ గౌరవం ఉంది.

సనాతన ధర్మమే మన దేశానికి బలం” అని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. “మన దేశం ముం దుకు సాగుతోంది. ఆపరేషన్ సింధూరం తరువాత దేశ బలం మరింత పెరిగింది” అని పేర్కొన్నారు. రాంచందర్‌రావు మాట్లాడు తూ.. “భారత అభివృద్ధికి మాత లలితా దేవి ఆశీస్సులు అత్యవసరం” అన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. “భారతదేశం అభివృద్ధి చెందుతోంది.

నేడు మొ త్తం ప్రపంచం మన దేశం వైపు చూస్తోంది” అని అన్నారు. రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే న్యా యం ఉంటుం ది. ఈ సిద్ధాంతంతోనే భారత్‌ను 2047 నాటికి విశ్వగురు వుగా చేయ డానికి కృషి చేస్తున్నాం” అని తెలిపారు. ఈ యజ్ఞంలో సుధాకర్‌శర్మ, డాక్టర్ అనంతలక్ష్మి, కరాటే కళ్యాణి, దీపక్‌రెడ్డి, డాక్టర్ ఎన్ గౌతమ్‌రావు, జి అనంత లక్ష్మి, శ్రీదేవి, అన్వేష్‌రెడ్డి, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.