calender_icon.png 11 October, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూరాబాద్‌లో బీఫారాలు ఇచ్చేది నేనే..

11-10-2025 12:38:54 AM

  1. 25 ఏళ్ల నుంచి నావెంట ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటా

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ది మోసపూరిత ధోరణి

బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది 

మాజీలకు తక్షణమే కమిషన్లు లేకుండా పెండింగ్ బిల్లులు చెల్లించాలి

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ 

హుజురాబాద్, అక్టోబర్ 10:(విజయ క్రాంతి) హుజురాబాద్ లో బీజేపీ తరఫున బీఫారాలు ఇచ్చేది తానేనని, 25 ఏళ్లుగా తన తో నడిచిన కార్యకర్తలను కాపాడుకుంటానని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో గందరగోళం సృష్టించిందని అన్నారు.

42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని, వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి గందరగోళం సృష్టించారని ఈటల రాజేందర్ విమర్శించారు.

బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేసిందని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ, చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఈ అంశం అబాసుపాలైందని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, అనాలోచితంగా, మూర్ఖంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఈ రిజర్వేషన్ల అంశం రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఇది రాజ్యాంగ సవరణ అంశం, కేంద్రానికి సంబంధించిందని, రాజ్యాంగబద్దమా కాదా చూడాలని స్ప ష్టం చేశారు.

కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ’డ్రామా’ అని, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడే ఇది తెలిసిపోయిందని ఈటల విమర్శించారు. బీసీ సంఘాలు, నాయకులు ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. బీజేపీ వ్యతిరేకిస్తోందనేది పస లేని వాదన అని కొట్టిపారేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా రిజర్వేషన్లు సాధించలేరని, ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

42 శాతం రిజర్వేషన్లపై చెంపలు వేసు కొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని కాంగ్రెస్ ని ప్రశ్నించారు. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకు సంబంధించిన బిల్లులు వెంటనే చె ల్లించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గతంలో కేసీఆర్ వేధిస్తున్నాడని, చతికిల పడిన పార్టీని గెలిపిస్తే ఇప్పుడు ప్రజలను, ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నిస్తూ, ఆరు గ్యారంటీలు, హామీల గురించి మాట్లాడట్లేదని, గతంలో ఉన్నవే ఇవ్వమని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. బీసీలకు బీజేపీ అండగా ఉంటుం ది అని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అబద్ధాల పునాది, గోల్మాల్ అని అన్నారు. హైదరాబాద్లో పేదల గుడిసెలు కూలకొట్టింది, ప్రజల బతుకులు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎప్పటికైనా ప్రజలకు అండగా, తోడుగా ఉండేది బీజేపీ మాత్రమేనని అన్నారు. పదవులకంటే ప్రజలే ముఖ్యం అని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజల కోసం పోరాటం చేశాననిగుర్తుచేశారు.