calender_icon.png 11 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తారామతిపేటలో మొసలి కలకలం

11-10-2025 12:41:07 AM

అబ్దుల్లాపూర్ మెట్, అక్టోబర్ 10: హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి తారామతిపేట మొసలి కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఔటర్ సర్వీస్ రోడ్డు తారామతి పేట గ్రామం నుంచి మూసీలోకి వెళ్లే కాలువ పక్కన ముసలి ఉన్నట్లు గురువారం రాత్రి 2 గంటల సమయంలో స్థానికులు గమనించారు.

వెంటనే స్థానిక పోలీసులు సమాచారం  ఇవ్వడంతో ఇద్దరి పోలీసులు సిబ్బంది అక్కడికి చేరుకుని మొసలికి కాపలా ఉన్నారు. తెల్లవారుజమున పోలీసులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటన స్థానికి చేరుకునే సరికి మొసలి తారామతిపేట్ గ్రామంలో ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

పోలీసులు, అటవీశాఖ అప్రమత్తం అయి మొసలిని పట్టి బంధించి జూ పార్కుకు తరలించడంతో గ్రామస్తులు ఊరిపి పీల్చు కున్నారు. ఈ మొసలి 12 ఫీట్ల పొడవు..120 కిలోల బరువు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.