11-09-2025 12:00:00 AM
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక రితికా చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకుంది.
--ఈ సినిమాలో దాదాపు 80 శాతం లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్లలోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్‌తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.
-వరుణ్‌తేజ్‌తో ఒక సినిమా చేస్తు న్నా. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నా యి. మేకర్స్ తెలియజేస్తారు.
-నా తొలి చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తర్వాత ఒక మంచి పాత్ర కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. అద్భుతమైన కథ ఇది. ఇందులో నా క్యారెక్టర్ చాలా నచ్చింది. -ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. -చాలా బలమైన పాత్ర చేశాను. హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది.
--తేజ చాలా ప్రొఫెషనల్. వెరీ స్వీట్. అంకితభావంతో పనిచేస్తాడు. ఈ సినిమా షూటింగ్‌లో చాలా గాయాలయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినా కరెక్ట్ టైమ్‌కు సెట్ లో ఉండేవారు.ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.
-ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటీనటులు పనిచేశారు. వాళ్లందరితో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. మనోజ్ చాలా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. ఆఫ్‌స్క్రీన్ ఆయన చాలా ఫన్‌ఫుల్‌గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. జగపతిబాబు, శ్రియాతో కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవడం మంచి అనుభూతినిచ్చింది.
-కార్తీక్ చాలా విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన సెట్‌లో చాలా క్లారిటీ గా ఉంటారు. సినిమాను చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మా ఇద్దరి బర్త్ డేస్‌కి ఒక్క రోజు గ్యాప్. సెట్‌లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునేవాళ్లు (నవ్వుతూ).
-కథలో ప్రాధాన్యత ఉన్న అన్నిరకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే అన్నిరకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే నాకు సూపర్ హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ నాకు చాలా ఇష్టమైన సినిమా. యాక్షన్ రొమాన్స్ నా ఫేవరెట్ జోనర్స్. నాకు సాయిపల్లవి అంటే చాలా ఇష్టం. తనే నా స్ఫూర్తి. ‘ఫిదా’ చూసి ఫిదా అయిపోయా.