11-09-2025 12:00:00 AM
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన 41వ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘డీక్యూ41’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం లో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరు కూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తు తం హైదరాబాద్‌లో జరుగుతోంది.
గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొం దుతున్న ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన సినిమాగా మంచి అనుభూతి ఇవ్వనుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిం చారు. ఈ మేరకు పూజా షూటింగ్‌లో పాల్గొంటున్న ఓ ప్రత్యేక వీడియోను విడు దల చేశారు.
ఇందులో పూజ, దుల్కర్ స్కూ టీపై ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో వారి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: అనయ్ ఓం గోస్వామి.