calender_icon.png 24 October, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశాను

24-10-2025 12:00:00 AM

  1. నా స్వంత స్వార్థం కోసం వెళ్ళినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ అక్టోబర్ 23 (విజయ క్రాంతి):  బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ ఆయన స్వగృహంలో గురువారం బాన్సువాడ నియోజకవర్గం లోని అన్ని మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులతో కలిసి అందజేశారు.

అనంతరo ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నా కుటుంబం కోసం నా స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని కేవలం బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే సీఎంను కలిశానని వివరించారు. సీఎం దగ్గర నా స్వార్థం కోసం వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్గా ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అడిగినన్ని అభివృద్ధి నిధులు బాన్సువాడకు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.

నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరమని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, బాన్సువాడ సొసైటీ ఛైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నార్ల రవీందర్ నార్ల సురేష్ ఎజాజ్ శీను మోహన్ నాయక్ గోపాల్ రెడ్డి దావూద్ మోసిన్ వాహబ్, లింగం తదితరులు పాల్గొన్నారు.