calender_icon.png 24 October, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

24-10-2025 12:00:00 AM

బోడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు

టేకులపల్లి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ  అంకితభావంతో కృషి చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. గురువారం టేకులపల్లి మండలం బోడు పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. బోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది  ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.

అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.  పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో అసాం ఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోలట్స్ వాహనా  లతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇల్లందు డిఎస్పీ   చంద్రభాను, టేకులపల్లి సీఐ సత్యనారాయణ, ఎస్త్స్ర శ్రీనివాసరెడ్డి  సిబ్బంది పాల్గొన్నారు.