24-10-2025 12:00:00 AM
కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మత్తుతో జీవితాలను చిత్తు చేసుకోవద్దని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కోరారు. గురువారం సుజాతనగర్ సెంటర్లో ‘ చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం‘ అనే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు గారు, సుజాతనగర్ ఎస్త్స్ర రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు.
ఇట్టి ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం కాలేజ్,ధన్వంతర కాలేజ్ ,శ్రీ ఫార్మసి కాలేజ్ సుజాతనగర్ హైస్కూల్ కు చెందిన స్టూడెంట్స్,అదే విధంగా సుజాతనగర్ మండలానికి చెందిన రాజకీయ నాయకులు, ఇతర పబ్లిక్ మొత్తం దాదాపు 700 మంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ నెల 15వ తారీకు నుండి వచ్చే నెల 15వ తారీకు వరకు ప్రతిరోజు చేపట్టే చైతన్యo ప్రోగ్రాంలో భాగంగా జనాలకు డ్రగ్స్ గురించి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ రెహమాన్ అన్నారు.
డ్రగ్స్ అమ్మకం,రవాణా,కలిగి ఉండడం,సేవించడం,కొనడం చట్టరీత్యా నేరమని,ఆఁ విధంగా ఎవరైనా పట్టుబడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.