21 August, 2026 | 3:27 AM

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా

21-08-2026 01:34 AM

వనపర్తి టౌన్, ఆగస్టు 20: జీవో నం.97, శక్తి స్క్పీ ఆందోళన వ్యక్తం చేస్తూ వనపర్తి పాలిటెక్నిక్ విద్యార్థులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ చేసే చర్యలను నిలిపివేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను విన్న ఎమ్మెల్యే, జీవో 97, శక్తి స్కీమ్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.