calender_icon.png 1 January, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమిష్టి కృషితో స్థానిక సంస్థల్లో సత్తా చాటుదాం

01-01-2026 01:32:35 AM

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపు

ఖానాపూర్, డిసెంబర్31 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సమిష్టి కృషితో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఖానాపూర్ నివాసంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎఫ్‌ఎసిఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కలిసి సన్మానం చేశారు. రాబోయే మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రె స్ గెలుపు కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కు తప్పకుండా పార్టీ ద్వారా అవకాశాలు లభి స్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.