12-08-2024 07:03:06 PM
న్యూఢిల్లీ: చీటింగ్, ఫోర్జరీ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఖేద్కర్‌ను ఆగస్టు 21 వరకు పోలీసులు అరెస్టు చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో అదనపు ప్రయత్నాలను పొందేందుకు ఆమె తన గుర్తింపును తప్పుగా చూపించారని ఖేద్కర్‌పై ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేయగా, ఈ కేసును జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఖేద్కర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, యూపీఎస్సీ తరఫున న్యాయవాది నరేష్ కౌశిక్ వాదించారు. వివరణాత్మక విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.