calender_icon.png 21 January, 2026 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజీ బరిలో గిల్, జడేజా

20-01-2026 12:00:00 AM

రాజ్‌కోట్, జనవరి 19: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరిద్ద రూ రంజీ మ్యాచ్ ఆడబోతున్నారు. వీరిద్దరికీ ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్‌మెం ట్స్ లేవు. గిల్ టీ ట్వంటీ జట్టులో లేకపోవడంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సిందే. జడేజా 2024 లోనే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ప్రస్తు తం వీరిద్దరూ తమ తమ రాష్ట్ర జట్లకు ప్రాతిని థ్యం వహించబోతున్నారు. జనవరి 22 నుంచి రాజ్‌కోట్ వేదికగా పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో గిల్ పంజాబ్ తరపునా, జడేజా సౌరాష్ట్ర తరపునా బరిలోకి దిగబోతున్నారు.

గిల్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. చివరిసారిగా గత సీజన్‌లో కర్ణాటకపై ఆడాడు. అటు జడేజా మాత్రం ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ ఆడాడు. ఎలైట్ గ్రూప్ లో సౌరాష్ట్ర, పంజాబ్ జట్లు ప్రస్తుతం వెనుకబడ్డాయి. సౌరాష్ట్రా ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయమే సాధించగా.. నాలుగు డ్రాల తో సరిపెట్టుకుంది. అలాగే పంజాబ్ కూడా ఒక విజయం, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే న్యూ జిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గిల్ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. జడేజా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. సిరీస్ మొత్తం మీద ఒక్క వికెట్ కూడా తీయలేదు. బ్యాట్‌తోనూ కేవలం 43 పరుగులే చేశాడు. ప్రస్తుతం అతని వన్డే కెరీర్ సందిగ్ధంలో పడింది.