03-05-2025 02:32:50 AM
ఈ--సర్వైలెన్స్ మెకానిజంతో నవీకరణ
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): మల్కాజిగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచీ వద్ద ఈ--సర్వైలెన్స్ మెకానిజంతో నవీకరించిన మరో ఏటీఎంను ప్రారంభించారు. కస్టమర్ల భద్రతా లావాదేవీల కోసం మరిన్ని భద్రతా లక్షణాలతో నవీకరించిన ఏటీఎంను బ్యాంకు డైరెక్టర్ బద్రి విశాల్ ముందాడ, ఎండీ, సీఈవో వి అరవింద్ కస్టమర్లతో కలిసి ప్రా రంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకు యాజమాన్యం, కస్టమర్ల సౌలభ్యం, భద్రత కోసం అధిక నాణ్యత గల ఏటీఎంలను తమ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. కస్టమర్ల నిరంతర మద్దతు, ప్రోత్సాహంతో బ్యాంక్ ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాల్లో మొత్తం రూ.4,450 కోట్ల వ్యాపారాన్ని (బ్యాంక్ చరిత్రలో అత్యధిక వ్యాపారం అంటే 31.03. 2021 నాటికి) చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇన్ని సంవత్సరా లుగా క్రియాశీల మద్దతు ఇచ్చినందుకు కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బ్యాంక్ తె లంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థా న్ రాష్ట్రాలను కలిపి 45 బ్రాంచీలతో పనిచేస్తోందని తెలిపారు. 50వ స్వర్ణోత్సవ వేడు కలనాటికి అంటే 2028 నాటికి మరో 5 శాఖలను ప్రారంభించాలని యోచిస్తునట్టు వెల్లడించారు. బ్యాంకు వ్యాపార మిశ్రమం నేటికి రూ.2,646 కోట్లుగా ఉన్నదని చెప్పారు.