calender_icon.png 27 July, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే పూలవర్షం.. లేదంటే రాళ్ల వర్షం

27-07-2025 01:23:58 AM

- రిజర్వేషన్లు అమలు బాధ్యత బీజేపీ ఎంపీలదే

- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, జూలై 26: బీసీ రిజర్వేషన్లను అన్ని పార్టీలు ఆమోదిస్తే పూల వర్షం కురిపిస్తామని, లేని పక్షంలో రాళ్ల వర్షం కురుస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల అమలు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఆమోదింపజేసే బాధ్యత బీజేపీ ఎంపీలపై ఉన్నదన్నారు. పట్టనట్లు వ్యవహరిస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

శనివారం బషీర్‌బాగ్ ప్రెక్లబ్ లో జాతీయ బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్లలో మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న గోవాలో నిర్వహించ తలపెట్టిన  ఓబిసి మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 32 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి కుదించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రిజర్వేషన్ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారకు. వారం రోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి 42శాతం బిల్లును ఆమోదించేట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీల ద్రోహి అని ఆరోపించారు. బీసీ వ్యతిరేకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.