calender_icon.png 27 July, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం..

27-07-2025 01:22:10 AM

- పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది.

- టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ 

కూకట్ పల్లి 26 జూలై (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతుందని టిపిసి ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ బండి రమేష్ అన్నారు. శనివారం మూ సాపేట్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా నని చెప్పుకునే కృష్ణారావు రోజుకు రెండు గం టలకు మించి ప్రజలకు అందుబాటులో ఉం డవు. ఇటువంటి వ్యక్తి అయినా నువ్వు కాంగ్రె స్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం గా ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో అభివృద్ధి జరగడంలేదని హౌసింగ్ బోర్డ్ భూములను అమ్ముకుంటున్నారని కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బండి రమేష్  ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదంటూ నానాయాగి చేసే కృష్ణారావు ఎమ్మెల్యేగా గత 11 ఏళ్లుగా నియోజకవర్గానికి ఏం చేశాడంటూ ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థి వర్గాల ఫోన్లు ట్యాప్ చేయించడం అధికారులను బెదిరించడం ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, బెదిరించడం తప్ప అతను నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని కృష్ణారావు పై ధ్వజమెత్తారు.

ఫోన్ ట్యాప్ అయిన వారి పేర్లను ఆయన మీడియాకు వెల్లడించారు. రోజుకు రెండు గంట లు మించి ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే ప్రభుత్వంపై తరచూ పనికిరాని, పసలేని విమర్శలు చేయడం ఆయన దిగజారు డు తనానికి  నిదర్శనం అన్నారు. అసలు హౌసింగ్ బోర్డ్ ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హౌసింగ్ బోర్డ్ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం పలు రక్షణ చర్యలు తీసుకుంటుంది అన్నారు

టిఆర్‌ఎస్ హయంలోనే హౌసింగ్ బోర్డ్ స్థలాలను ప్రభుత్వ స్థలాలను చెరువులు కుంటలు ఆక్రమించి నాయకులు కార్యకర్తలు దోచుకుతిన్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోడ్లు కబ్జా చేసి డబ్బాలు వేయించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేది నీ అనుచరులే అని విమర్శించారు. చెరువుల సుందరీకరణ పేరుతో టిఆర్‌ఎస్ నాయకులు దోచుకోవడానికి దారి చూపారని ఆయన పేర్కొన్నారు.