22 June, 2026 | 8:38 AM

రెండుసార్లు గెలిస్తే సీఎం నేనే

18-10-2025 01:43 AM

 ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహబూబ్ నగర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): మరో రెండుసార్లు గెలిపిస్తే  ముఖ్య మంత్రి నేనే అవుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలోని డీసీసీ ఎంపికకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మె ల్యే సంభాషించారు. మంత్రులు ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే అభివృద్ధి ఆగ కుండా వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కోడంగల్‌కు వెళ్లి చూడం డి రూ 500 కోట్ల అభివృద్ధి పనులు అతివేగంగా జరుగుతున్నాయని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు నాపై ఉన్న నమ్మకంతో నన్ను గెలిపించారని వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని తెలియజేశారు. ప్రజల ఆశయాలను పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు శాయాశక్తులుగా కృషి చేస్తానన్నారు.