calender_icon.png 20 October, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీర విద్యాలయంలో దీపావళి సంబరాలు

18-10-2025 01:42:57 AM

రామాయంపేట, అక్టోబర్ 17 : రామాయంపేటలోని మంజీర విద్యాలయంలో ముందస్తుగా దీపావళి సంబరాలను అంబరాన్నంటే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి మాట్లాడుతూ దీపావళి పర్వదినం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవే భారతీయ పండుగలన్నారు. అనంతరం లక్ష్మీ పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పాఠశాలలో దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండ్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ మౌనిక, సౌమ్య, మీనా శ్రీనిత, అనిల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.