08-07-2025 12:21:40 AM
నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు?
తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఫోన్
డిపిఓ నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గరం గరం
మహబూబ్ నగర్ జూలై 7 (విజయ క్రాంతి) : అక్రమాలు జరిగాయని వెలుగులో కి వచ్చిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనది అంతూ చిక్కడం లేని ప్రశ్నగా మిగులుతుంది. జడ్చర్ల నియోజకవర్గం అవినీతి అక్రమాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని ముందు నుంచి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చెబుతున్న మాట. ఈ క్రమంలోని కొంతమంది అధికారులను సైతం జ డ్చర్ల నియోజకవర్గంలో నుంచి బదిలీ చే యించిన దాఖలాలు లేకపోలేదు.
పోలేపల్లి గ్రామపంచాయతీలో రూ 1.73 కోట్ల ని ధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడు జరిగిందని డిఎల్పిఓ నివేదిక సమర్పించినప్పటికీ నేటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాదన ఉత్పన్నమవుతుంది. నిన్న తరబడి కూడా అధికారులు అవినీతి జరిగిందని చె ప్పినప్పటికీ ? నివేదిక తేల్చినప్పటికీ ? ఉన్న త అధికారులు మాత్రం సంబంధిత వ్యక్తులపై నేటికీ చర్యలు తీసుకోలేదు.
అవినీతి అ క్రమాలపై సమగ్ర నివేదిక పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫోన్ చేసి వివరాలను తెలియజేశారు. ఇకనైనా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొంటున్నారు.
- ఎందుకింత నిర్లక్ష్యం....
పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సంబంధిత అధికారులు నివేదిక సమర్పించినప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి త ప్పులకే చర్యలు తీసుకుంటూ కేసులు నమో దు చేస్తూ తప్పు చేసిన వారికి శిక్ష వేసేలా చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రం ప్రజాధనం దుర్యోగం చేసినప్పటికీ నిర్లక్ష్యం గా ఉండవలసిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
- ఎమ్మెల్యే చెబితేనే స్పందిస్తారా..?
అవినీతి అక్రమాలు జరిగాయని అప్పటి ఉన్నత అధికారులు నివేదిక చెప్పినప్పటికీ జి ల్లా పంచాయతీ శాఖ అధికారి సంబంధిత పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేశారు. ఈ విషయంపై సాక్షాత్తు ఎమ్మెల్యే మరో మారు ప్రత్యేక దృ ష్టి సారించి అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
చిన్న చిన్న తప్పులకే వెంటనే స్పం దించి వివిధ చర్యలకు పాల్పడుతున్న అధికార యంత్రంగానికి మరి అధికారులు తప్పు చేస్తే ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజల సైతం ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అక్రమాలకు పాల్పడిన అధి కారులపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ప్రజలు కోరుతున్నారు.
- మరో మరో విచారణ పూర్తి..
గతంలో డిఎల్పిఓ పోలేపల్లి పంచాయతీ పై పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమాలు జరిగాయని నివేదిక తెలిసినప్పటికీ ఇటీవల మరో మరో సంబంధిత అధికార యంత్రం విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని మరోసా రి విచారించాలంటూ డిఆర్డిఓ పిడి, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జడ్చర్ల ఎంపీ డీవో లతో త్రిమెన్ కమిటీని ఏర్పాటు చేయ డం,
ఆ కమిటీ తమ విచారణను పూర్తి చేసి 3 నెలలు కావోస్తున్న నివేదికను సమర్పించకపోవడం పట్ల అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలేపల్లి గ్రామస్తులు సోమవారం నిరసన దీక్షలు ప్రారంభించి నిధుల దుర్వినియోగంపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారు లు తప్పు చేశారు వారిపై చర్యలు తీసుకోండి అంటేనే తీసుకుంటారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.