08-07-2025 12:23:36 AM
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి డిమాండ్
ఖైరతాబాద్‌ష్మజూలై 07 (విజయ క్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అందెల శ్రీరాములు యాదవ్‌కు రోహింగ్యాల నుంచి ప్రాణ ముప్పు పొంచి ఉన్నదని, అతనికి పోలీసు భద్రత కల్పించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇటీవల అందెల శ్రీరాములుపై రోహింగ్యాలు రెక్కీ నిర్వహించి, హత్య చేసేందుకు యత్నించి పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందేనన్నారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పలు యాదవ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బిసి సామాజికవర్గానికి చెందిన అందెల శ్రీరాములును చంపేందుకు రోహింగ్యాలు కుట్ర చేస్తున్నా , రాష్ర్ట ఇంటెలిజెన్స్, ఎస్ బి వ్యవస్థలు ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు.
మయన్మార్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి రోహింగ్యాలు అక్రమంగా వలస వచ్చి, మహేశ్వరం నియోజకవర్గంలో నివాసముంటున్నారని తెలిపారు. వీరికి ఆధార్ కార్డు ఓటర్ కార్డులు ఎవరు ఇప్పిస్తున్నారని నిలదీశారు. అన్నిరాజకీయ పార్టీల్లో ఉన్న తమ యాదవ నేతలను తాము కాపాడుకొంటామని స్పష్టంచేశారు. అనంతరం సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగె శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..
బండెల శ్రీరాములుకు ఏదైనా జరిగితే రాష్ర్టంలోని యాదవులను బిసిలను కలుపుకొని నిరసనలు, ఉద్యమాలతో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సమితి నేతలు రవి యాదవ్, దయాకర్ యాదవ్ ఎడ్ల కిరణ్ యాదవ్. సింహ యాదవ్, వెంకటేశ్ యాదవ్, మల్లికార్జూర్ యాదవ్, వీరేందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శివ యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.