calender_icon.png 8 July, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కొత్త జేఏసీ ఏమైంది?

08-07-2025 12:24:35 AM

- జేఏసీ ఏర్పాటులో కనిపిస్తున్న అనైక్యత 

- సంఘం ఏర్పాటును అడ్డుకుంటున్న పలువురు నేతలు

- కొన్ని సంఘాలపై కార్మికులకు అనుమానం

- యాజమాన్యం, సర్కారుకు అనుకూలమని అనుమానాలు

- గత నెలలోనే పాత జేఏసీ రద్దు

- ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ

- ఇప్పటికే ఆర్టీసీలో ప్రారంభమైన ఔట్ సోర్సింగ్ విధానం 

- కష్టకాలంలోనూ ఐక్యంగా ఉండలేకపోతున్న కార్మిక సంఘాలు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేయడం, ట్రేడ్ యూనియన్ గుర్తింపు పునరుద్ధరణ సహా ఎన్నో ఆకర్షణీయమైన హామీలను ఆర్టీసీ కార్మికులకు కాం గ్రెస్ పార్టీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చినా ఆహామీలు నెరవేర్చలేదు. కానీ మహిళలకు ఉచిత బస్సు హామీ మాత్రం నెరవేరింది.

అయితే కార్మికులను మాత్రం సర్కారు ప ట్టించుకోవడం లేదనే ఆర్టీసీ కార్మిక సం ఘాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఓవైపు ఉచిత బస్సు సేవలను వినియోగించుకునే మహిళల సంఖ్య భారీగా పెరిగిపోయి డ్రైవ ర్లు, కండక్టర్లు ఎన్నో బాధలు పడుతున్నారు. కొత్తగా రిక్రూట్‌మెంట్లు లేక ఉన్న వారితోనే అదనపు పనిగంటలు చేయిస్తూ శ్రమ దోపి డీ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వానికి పైసా ఖర్చు కూడా కాని ట్రేడ్ యూనియన్ గుర్తింపు పునరుద్ధరించకపోవడంపై కార్మికులకు తీవ్ర ఆగ్ర హా న్ని కలిగిస్తోంది. ఇదే నేపథ్యంలోనే పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ప్రైవేటు ఎలక్ట్రిక్ బ స్సుల కారణంగా డిపోలకు డిపోలే మా యమయ్యే పరిస్థితి తలెత్తుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేప థ్యంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కలిసి ఐక్యంగా పోరాటం సాగించాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే ఉన్న ఆర్టీసీ జేఏ సీ లో కొన్ని సంఘాలు లేవనే ఉద్దేశంతో ఏకై క జేఏసీని ఏర్పాటు చేసుకునేందుకు  ఉన్న జేఏసీని రద్దు చేసుకున్నారు. కొత్తగా విశాల జేఏసీని ఏర్పాటు చేసుకునేందుకు మూడుసార్లు సమా వేశమైనా ఏకాభిప్రాయం సా ధించలేకపోయారని తెలుస్తోంది. 

ఔట్ సోర్సింగ్ రూపంలో ప్రమాదం..

ఓవైపు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాల ప్రక్రియను యాజమాన్యం చే పట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే కాంగ్రెస్ సర్కారు హామీని బుట్టదాఖలు చేసిందని కా ర్మికులు ఆరోపిస్తున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో కార్మిక సంఘాలు  అనైక్యతను చా టుకుంటే యాజమాన్యం పని మరింత సులువవుతుందని కార్మికులు అంటున్నారు.

కార్మికులకు ద్రోహం చేసే వారు మరోసారి పునరాలోచించుకోవాలని కార్మికులు డి మాండ్ చేస్తున్నారు. నగరానికి త్వరలో కొ త్తగా మరో 2వేల ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని... ఫలితంగా సుమారు 7,8 వేల మంది నగరంలో పనిచేసే ఆర్టీసీ కార్మికులను జిల్లాలకు తరలించే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే నగరంలోని కొన్ని డిపోలను నేరుగా ప్రైవే టు ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే కంపెనీ అయినా మెగా సంస్థకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు అప్పగించడాన్ని చూపిస్తున్నారు. జిల్లాల్లోనూ జేబీఎం సంస్థకు కరీంనగర్ డిపోను అప్పగించారని... త్వరలో మరిన్ని డిపోలను అప్పగించే కార్యక్రమం నడుస్తోందని వాపోతున్నారు. విద్యుత్ బస్సులు ఎం త పెరిగితే కార్మికుల ఉద్యోగాలకు అంత ప్ర మాదం ముంచుకు వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు నిలబడితే చాలనే పరిస్థితి ఉ న్నా... కార్మిక సంఘాల నేతలు ఇంకా ఐక్యం గా ముందుకు రాకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ పూ ర్తిగా ప్రైవేటు దిశగా పోయిన తర్వాత ఈ నా యకులు మేల్కొంటారా అని ప్రశ్నిస్తున్నారు.

మనుగడే ప్రశ్నార్థకమైనా కొరవడిన ఐక్యత..

ఓవైపు ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నా కూడా కొన్ని కార్మిక సంఘాల నేతలు ఉద్దేశపూర్వకంగా జేఏసీ ఏర్పాటును అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకైక జేఏసీ ఏర్పాటైతే తిరిగి పోరా టాలు ఊపందుకుని ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికుల ఆందోళన ఉగ్రరూపం సెగ తగులుతుందని భావిస్తున్న కొందరు యూనియన్ లీడర్లు కావాలనే అడ్డుతగులుతున్నారని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వ పెద్దలతో టచ్‌లో ఉండి తమ పనులు, పైరవీలు చేస్తూ వెనకేసుకుంటున్న సదరు నేతలు... కార్మికుల సంక్షేమం, భవిష్యత్తు పట్టకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఆర్టీసీ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల కష్టాలను ఫణంగా పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మిక సంఘాల నే తల పేరిట గతంలోనూ భారీగా వసూళ్లు చేసిన కొందరు ఇంకా ఆర్టీసీని పట్టి వేలాడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఆర్టీ సీ మనుగడే ప్రశ్నార్థకంగా మారినా కూడా ఇంకా తమ రాజకీయాల కోసం కార్మికులను బలి చేయవద్దని కోరుతున్నారు. ప్రస్తు తం లేబర్ కమిషన్ వద్ద ఆర్టీసీలో గుర్తింపు పొందిన 11 యూనియన్లలో రెండు, మూడు యూనియన్లు మినహా మిగతా యూనియన్లంతా జేఏసీని త్వరగా ఏర్పాటు  చేసి పోరా టం చేసేందుకు సిద్ధపడుతున్నాయి.

అయితే రెండు, మూడు సంఘాలకు చెందిన కొంద రు నేతలు మాత్రం జేఏసీ ఏర్పాటుకు అడ్డుతగులుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 24న జేఏసీని రద్దు చేసినా నేటికీ కొత్త జేఏసీ ఏర్పాటు కాలేదని కార్మికులు చెబుతున్నారు.