calender_icon.png 8 July, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాలపై మొండిగా ముందుకు..

08-07-2025 12:20:49 AM

- పోలీసు పహారాలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యాదయ్య

- పనులు అడ్డుకొని ఆందోళన చేపట్టిన బాధిత రైతులు

- ఎకరాకు 1000 గజాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్

- 300 గజాలకు మించి ఇవ్వలేమన్న ఆర్డీవో, తహసీల్దార్

చేవెళ్ల, జులై 7: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కెప ల్లిలో గోశాల ఏర్పాటు విషయంలో సర్కారు మొండిగా ముందుకెళ్తోంది.  సర్వే నెంబర్  180లోని 99.14 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఇప్పటికే  స్వాధీనం చేసుకోగా సో మవారం పోలీసు పహారాలో ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమి పూజ చేశారు.

అధికారులు వెంటనే జేసీబీలతో పనులు మొదలు పెట్టగా విషయం తెలుసుకున్న రైతులు పను లు ఆపే ప్రయత్నం చేశారు. కానీ,  వారిని పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.  ఈ క్రమంలో పోలీసులు, బాధితులకు మ ధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  ఇందుకు నిరసనగా ధర్నా కు దిగిన రైతులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మె ల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

70  ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఎలాంటి  పరిహారం ఇవ్వకుం డా ఎలా గుంజుకుంటారని ప్రశ్నించారు.  త మ తాతల కాలం నుంచి రాళ్లు, రప్పలు, గు ట్టలుగా ఉన్న భూములను చక్కగా చేస్తే.. ఇ ప్పుడు గద్ద ఎత్కపోయినట్టు మాయం చేస్తున్నారని మండిపడ్డారు.

నేతలు, అధికారులు న్యాయం చేయమంటే దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులు కొట్టడమే కాదు కేసులు పె డతామని బెదిరిస్తున్నారని వాపోయారు.  భూమికి భూమి, లేదా ఎకరాకు 1000 గ జాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అ నంతరం రైతులతో మాట్లాడిన ఆర్డీవో చం ద్రకళ, తహసీల్దార్ గౌతమ్ కుమార్ ఎకరా కు 300 గజాల స్థలం మాత్రమే ఇస్తామని, అంతకుమించి ఇవ్వలేమని తేల్చిచెప్పారు.  ఏం చేసినా పనులు మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. 

నెల రోజులుగా ఆందోళన

ఎన్కెపల్లి రెవెన్యూలోని 180 సర్వే నంబ ర్లో 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో 50 రైతు కుటుంబాలు నెల రోజులుగా ఆం దోళన చేస్తున్నాయి.  అయితే  రైతులు ఈ భూమిని 70 ఏండ్లుగా సాగు చేసుకుంటు న్నా.. రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూమిగా నమోదవుతూ వచ్చింది.  కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత రెవెన్యూ అధికారులు.. 7 నెలల కింద  ప్రభుత్వ భూమిగా సూచిక బో ర్డు పాతారు. 

దీంతో ఆందోళన చెందిన రై తులు ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆశ్రయించగా.. ఆయన  ఆయన  సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  కానీ,  జూన్ 3న  కలెక్టర్  నారాయణరెడ్డి, హెచ్‌ఎం డీఏ కమిషనర్ సర్పరాజు, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ  భూములను పరిశీలించి.. గోశాలకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించా రు. 

బాధిత రైతులు భూములే తమకు ఆధారణమని,  వీటిని లాక్కొని తమ పొట్ట కొట్టొ ద్దని కలెక్టర్ను వేడుకోగా..  ఏమైనా డిమాం డ్లు  ఆర్డీవోకు చెప్పుకోవాలని ఆయన సూ చించారు. ఈ మేరకు  జూన్ 4న మొయినాబాద్ తహసీల్దార్ ఆఫీసులో ఆర్డీవో చంద్ర కళ,  తహసీల్దార్ గౌతమ్ కుమార్ రైతులతో చర్చలు జరిపి... ఎకరాకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు.  ఇందుకు ఒప్పుకోని రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం  పరిహారం, కనీసం 1000 గజాల స్థలం ఇవ్వాలని కోరారు.  

ఆదుకుంటానని చెప్పి..

ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఎమ్మె ల్యే కాలె యాదయ్య రైతులను ఆదుకుంటామని చెబుతూ వస్తున్నారు. భూములకు పట్టాలివ్వడం సాధ్యం కాకుంటే  ఎకరాకు 1000 గజాల స్థలం, గోశాలలో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జూన్ 20న  కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.

అయితే సర్కారు 250 గజా ల స్థలం ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పిన కలెక్టర్... వెయ్యి గజాల డిమాండ్ ను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైతులు భూముల్లోకి వెళ్లకుండా పోలీసులను కాపలా ఉంచడంతో జూన్ 27న బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారు. 

దీంతో ఆయన కలెక్టర్కు ఫోన్ చే సి రైతులకు న్యాయం జరిగే వరకు భూ ముల వద్దకు వెళ్లొద్దని సూచించారు. కానీ, ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని కలెక్టర్ బదులివ్వడంతో రైతులను వెంటపెట్టుకొని కలెక్టరేట్కు వెళ్లారు.  కనీసం 500 గజాలైనా ఇవ్వాలని కోరగా.. 250కి మించి ఇవ్వలేమని కలెక్టర్ తేల్చిచెప్పారు.  తర్వాత మూడు రోజుల కింద(జులై 5) హెచ్‌ఎండీఏ, రెవె న్యూ అధికారులు 200 మంది పోలీసు పహారాలో సర్వే పూర్తి చేశారు. 

రైతులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసినా.. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్డీవో చంద్రకళ ప్రభు త్వ అనుమతితో ఎకరాకు 250 గజాల  స్థలం ఇచ్చేందుకు కలెక్టర్ సిద్ధంగా ఉన్నారని,  రైతులు ఒప్పుకొంటే 300 గజాల  స్థ లం ఇచ్చి ఒక్కరోజులోనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, సోమవారం ఎమ్మెల్యే యాదయ్య స్వయంగా భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టా రు.  దీంతో కొందరు రైతులు ఆదుకుంటాడనుకుంటే ఆగం చేసిండని ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు.

నట్టేట ముంచిన సర్కారు

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లుంది కాంగ్రెస్ సర్కారు తీరు. న్యాయం జరుగుతుందని నమ్మి  ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినంక నట్టేట ముంచుతున్నరు. తాతలు, తండ్రుల నుంచి ఈ భూమిని సాగుచేసుకుంటున్నం. ఇప్పడు 300 గజాలు ఇస్తం.. ఖాళీ చేయిమంటున్రు.  కనీసం వెయ్యి గజాల జాగైనా ఇయ్యాలె. లేకుంటే బతుకుదెరువు లేకుండ పోతది.

 చాకలి భిక్షపతి, బాధిత రైతు

న్యాయం చేయకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కాలె యాదయ్య న్యాయం చేస్తాడనుకుంటే పట్టించుకోకుండా పోయిండు.  సోమవారం పొద్దుగల్ల 7.30 గంటలకు ఎమ్మెల్యే వస్తుండు.. సమస్య పరిష్కరిస్తాడని ఎమ్మార్వో ఫోన్ చేసిండు.  కానీ, అంతకంటే ముందే వచ్చి భూమి పూజ చేసి వెళ్లి పోయిండు.  పనులను అడ్డుకుంటే పోలీసులు లాఠీ చార్జి చేసిన్రు.  వినకుంటే కేసులు పెడుతామని సీఐ బెదిరిస్తున్నడు. 

డప్పు రమేశ్, బాధిత రైతు