calender_icon.png 9 September, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్టే!

31-08-2025 12:11:55 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని తప్పు ఒప్పుకున్నట్టే అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం కేసీఆర్ హయాంలో నిర్మిస్తే.. ఆయన హయాంలోనే కూలిందన్నారు.

శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కాళేశ్వరం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమగ్రంగా విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, దానికి భయపడే కేసీఆర్, హరీశ్‌రావు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక తప్పు అని భావిస్తే, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు.

ప్రతిపక్షనేతగా జీతభత్యాలు తీసు కుంటూ.. శాసనసభకు డుమ్మా కొడుతున్నారంటూ విమర్శించారు. ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామని, వాళ్లను ఏమి చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో కాళేశ్వరంపై పెట్టి న శ్రద్ధ డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల మీద పెట్టి ఉంటే అవి పూర్తయ్యే వన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని తానేనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు.